తెలంగాణ వద్దని సోనియాకు చెప్తా: జగ్గారెడ్డి సంచలనం

తాను సోనియాకు, అధిష్టానానికి త్వరలో లేఖ రాస్తానని చెప్పారు. ఈ నెల 8న స్వయంగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి కూడా చెబుతానన్నారు. అయితే రాష్ట్రం స్థానంలో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని కోరుతానని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అభ్యంతరం చెప్పనని, అయితే తన అభిప్రాయంలో మాత్రం ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ వస్తే భారతీయ జనతా పార్టీ వంటి మతతత్వ పార్టీలు మరింత పుంజుకుంటాయన్నారు. తెలంగాణ ఎందుకు ఇవ్వవద్దో చెప్పేందుకు తన వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తాను సిద్ధాంతాల పైన ఎదిగిన నేతను కాబట్టి అధిష్టానం నిర్ణయానికి శిరసా వహిస్తానని చెప్పారు. కాగా జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన అభిప్రాయం ఆయన వద్దే ఉంచుకోవాలని లేదా అధిష్టానం ముందు చెప్పాలి. అంతేకాని ఇలా బహిర్గతం చేస్తే ఆయనతో పాటు తమకూ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. జగ్గారెడ్డి బిజెపి నుండి టిఆర్ఎస్‌లోకి ఆ తర్వాత కాంగ్రెసులోకి వచ్చారని, తాము మాత్రం మొదటి నుండి ఇదే పార్టీలో ఉంటున్నామని చెబుతున్నారు.
ఏ రోజైనా ప్రకటన
తెలంగాణపై ఏ రోజైనా ప్రకటన రావొచ్చునని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తుండగా ఇక ఫ్రంట్‌లు ఎందుకని ప్రశ్నించారు. మూడేళ్లుగా తెలంగాణపై అధిష్టానం కసరత్తు చేస్తోందని, డిసెంబర్ 9వ తేదీలోగా ప్రకటన రావొచ్చునని అన్నారు.












Click it and Unblock the Notifications