ట్రిపుల్ ఐటి స్టూడెంట్స్‌తో బాబు: 'కాబోయే సిఎం' స్లోగన్స్

ఉత్తర తెలంగాణ ఏడారి అవుతున్నా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని, ఉద్యమం పేరుతో రాజకీయ లబ్ధి తప్ప సమస్యలు ఆయనకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ వద్ద వెయ్యి లారీల డబ్బు ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయాల్లోకి యువతని ఆహ్వానించి వారికి 30 శాతం కోటా ఇస్తామని చెప్పారు.
బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఏడారి అవుతుంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోరాటం చేస్తోందన్నారు. కెసిఆర్ ఆరు నెలలకో గారడీ చేస్తున్నారన్నారు. పార్టీలో పెరిగి, ఎదిగిన కొందరు నేతలు టిడిపిని వదిలి వెళ్లిపోతున్నారని, అలాంటి వారితో వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మళ్లీ పరుగు పెట్టిస్తానని, వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేస్తానని, రైతుల కోసం పని చేస్తానని చెప్పారు.
కాగా అంతకుముందు.. చంద్రబాబుకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు జిందాబాద్, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు', ఐటి సిఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడంతో వారిని ఆపడం ఒక దశలో సెక్యూరిటీ సిబ్బందికి కష్టసాధ్యమైంది. అంతకుముందు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మార్గంలో రైతులను, కూలీలను పలకరించారు. బాసర సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications