గౌహతి దుశ్శాసన పర్వం: 11 మంది దోషులు

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో ఆ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 16 మందిని నిందితులుగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అమర్‌జ్యోతి కలితతో పాటు 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ కామరూప్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్పీ మోయిత్రా శుక్రవారం తీర్పు చెప్పారు.
స్థానిక టెలివిజన్ చానెల్ జర్నలిస్టు గౌరవ్ జ్యోతి నియోగ్‌తో పాటు హఫీజుద్దీన్, దిగంత బాసుమతరి, జితుమోని దేకాలను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. కలితతో పాటు పసుపేంద్ర దాస్, సికిందర్ బాస్‌ఫోర్, ధనరాజ్ బాస్ఫోర్, నవజ్యోతి బరూచా, నవజ్యోతి దేకా, దీపక్ దేవ్, రుబుల్ అలీ, దేవదాస్, రూపకాంత కలిత, ఘనశ్యాం కుమార్ మాలిక్‌లను దోషులుగా తేల్చింది.
కేసులో 24 మంది సాక్షులను విచారించారు. వారికి ఏ శిక్ష విధించారనే విషయం ఇంకా తెలియలేదు. కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications