జగన్ పార్టీలోకి తిరుపతి ప్రజారాజ్యం ఎంపీ అభ్యర్థి!

వెలగపూడి ఇరవై ఏడేళ్లపాటు తమిళనాడులో వివిధ హోదాల్లో పని చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆయన విఆర్ఎస్ తీసుకొని ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అప్పుడు అతను ఓడిపోయాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వర ప్రసాద్‌కు చిత్తూరు జిల్లాతో మంచి అనుబంధముంది. ఆయనతో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
కాగా చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వచ్చిన విషయం తెలిసిందే. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిలలో ఒకరు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోగా మరొకరు ఈ నెల 16న చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి జగన్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications