జగన్‌వైపు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, టిడిపి సామల?

కలమట తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. కాగా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణం ఆయన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా జగన్ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారట. ఆ పార్టీలో చేరేందుకే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేసి ఉంటారని అంటున్నారు.
కలమట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1978, 1989, 1994, 1999, 2004లో ఆయన పాతపట్నం నుండి గెలుపొందారు. 2008 నవంబరులో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.
టిడిపికి రంగారెడ్డి గుడ్‌బై
హైదరాబాద్: ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్ సందర్భంగా గైర్హాజరైన ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధా రాణిలపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోనందుకు నిరసనగా తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల రంగారెడ్డి టిడిపికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... తల్లి పాలు తాగి చందంగా రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడిచిన వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు. కాగా సామల వైయస్సార్ కాంగ్రెసులో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications