వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీలో చిరంజీవి ఫోటో చిచ్చు: టి-ఎంపీలకు అవమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Ponnam Prabhkar
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ మేథో మధన సదస్సు ఆదివారం ఉదయం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సదస్సు కోసం వేదిక పైన ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేంద్రమంత్రి చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫోటోలు లేకపోవడం అసంతృప్తికి, చిచ్చుకు దారి తీసింది. చిరు ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం నేతలు, అభిమానులు ఆందోళనకు దిగారు. వారిని సముదాయించారు. కాంగ్రెసు వేసిన పిసిసి పుస్తకంలో దామోదర ఫోటో లేకపోవడం కూడా ఆయన వర్గానికి అసంతృప్తిని కలిగించింది.

మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలకు అవమానం జరిగింది. తెలంగాణ ఎంపీలు వేదిక పైకి వెళ్తుండగా పాసులు లేవంటూ అనుమతి నిరాకరించారు. దీంతో వారు వేదిక ముందు బైఠాయించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఎంపీలను బుజ్జగించి వేదిక పైకి తీసుకు వెళ్లారు. అనంతరం పొన్నం తెలంగాణ అమరవీరులకు సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని భేటీలో సూచించారు.

దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ... సమైక్య, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో మంది చనిపోయారని, వారందరికీ సదస్సు తరఫున అధ్యక్షుడిగా తాను సంతాపం తెలియజేస్తున్నానని, అందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటిద్దామన్నారు. ఈ మేథోమధన సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, రాష్ట్ర, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

కేంద్రమంత్రులు పురంధేశ్వరి, జైపాల్ రెడ్డి, ఎంపి హర్షకుమార్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు తాను హాజరయ్యేది లేదని ముందే చెప్పారు. కాగా ఇరు ప్రాంతాల్లో సమైక్య, తెలంగాణ వాదాలతో మృతి చెందిన వారికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రెండు ప్రాంతాల వారికి కుదరదని టిఎంపీలు కొద్దిసేపు వాదనకు దిగారు. అనంతరం ఇరు ప్రాంతాల వారికి మౌనం వహించారు.

English summary
Congress party leaders paid condolence to students who were committed suicide for Telangana and Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X