DK Shivakumar: కర్నాటక సీఎల్పీ నేతగా డీకేఎస్..! సీఎంగా ప్రమాణానికి గవర్నర్ ఆహ్వానం..!
కర్నాటకలో కొత్త సీఎంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమవుతోంది. ఇవాళ సమావేశమైన ఎమ్మెల్యేలు ఆయన్ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అధిష్టానం దూతలు రణ్ దీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సమక్షంలో సీఎం సిద్దరామయ్య డీకే పేరును సీఎల్పీ నేతగా ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు.
అనంతరం కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రావాలని డీకే శివకుమార్ కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నుంచి ఆహ్వానం కూడా అందింది. ఈ మేరకు జూన్ 3న కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ సమాచారం ఇచ్చారు. అలాగే డీకే శివకుమార్ తో పాటు దాదాపు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ప్రస్తుత కేబినెట్లోని 9 మంది మంత్రులు ఉంటారని తెలుస్తోంది.

కర్నాటకలో కొత్త కేబినెట్ కూర్పుపై ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశమై డీకే శివకుమార్ చర్చించారు. సిద్దరామయ్య కోరుతున్నట్లు ఆయన కుమారుడు యతీంద్రతో పాటు మరొకరికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరికొంత మంది సిద్దరామయ్య సూచించిన మంత్రుల్నీ కొనసాగించబోతున్నారు. అయితే అధిష్టానం కోరుకున్నట్లు సిద్దరామయ్య రాజ్యసభ సీటు తీసుకుని ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం మొగ్గు చూపడం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆ విషయంపై అధిష్టానం చర్చలు జరపనుంది.














Click it and Unblock the Notifications