గ్యాంగ్ రేప్: అట్టుడుకుతున్న ఢిల్లీ, సిఎం ఇంటి ముట్టడి

ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. షీలా దీక్షిత్ ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వాటర్ కెనాన్‌లు ఉపయోగించి మహిళలను అక్కడి నుండి చెదరగొట్టారు.
మరోవైపు వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఘటనలో బాధితురాలు, ఆమె స్నేహుతిడికి మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
గస్తీ పెంచుతామన్న షిండే
సామూహిక అత్యాచారం ఘటనలో ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో చెప్పారు. ఢిల్లీలో పోలీసుల గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. అక్రమంగా బస్సులు తిప్పుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రయివేటు బస్సు సిబ్బంది, రూట్ వివరాలను తెలిపే బోర్డులను ప్రదర్సించేట్లు చూడాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించే విధంగా చర్యలు చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications