Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి, చెర్రీపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

హైదరాబాద్: ఫిలించాంబర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణ రావు గురువారం సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో స్టార్‌లు ఉండరని, సూపర్ స్టార్‌లు మాత్రమే ఉంటారని చెప్పారు. తెలుగులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, దక్షిణాదిన రజనీకాంత్, దేశంలో అమితాబచ్చన్‌లు మాత్రమే సూపర్ స్టార్‌లు అన్నారు. అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చానని, అలాంటి వారు తనను మర్చిపోయారని, కొందరు తనను ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగారని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.

వారి గురించి త్వరలో రాస్తానని, అందరి బండారం బయటపెడతానని చెప్పారు. దాసరి నారాయణ రావు చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ, అక్కినేని నాగేశ్వర రావులను ఉద్దేశించి అని ఉంటారని అంటున్నారు. అయితే దాసరి వ్యాఖ్యల వెనుక ఆయన ఆవేదన కనిపిస్తోందని అంటున్నారు. చిరంజీవి, దాసరిల మధ్య ఎప్పటి నుండో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

గతేడాది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి సొంతకుంపటి పెట్టుకోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు చిరంజీవి ముందుకు వచ్చారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. మొన్నటి వరకు దాసరి కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అంతకుముందు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. అయితే చిరు పార్టీ విలీనం తర్వాత దాసరికి పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదనే వాదన వినిపించింది.

 చిరుపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

దాసరి నారాయణ రావు పుస్తకావిష్కరణ సమయంలో చేసిన వ్యాఖ్యలు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజను ఉద్దేశించి చేసినవే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 చిరుపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

ఎప్పటి నుండో చిరంజీవి, దాసరిల మధ్య విభేదాలు ఉన్నా.. చిరంజీవి తన పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేశాక పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడంపై దాసరి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

చిరుపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

కాంగ్రెసు పార్టీలో దాసరికి ప్రాధాన్యత తగ్గుతుందనే అభిప్రాయాన్ని మోహన్ బాబు కూడా వ్యక్తం చేసినట్లు వచ్చింది.

చిరుపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

దాసరి స్థానంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపించారనే వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత చిరు కేంద్రమంత్రి అయ్యారు. కాంగ్రెసులో తనకు ప్రాధాన్యత తగ్గుతుండటంతో దాసరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు దృష్టి సారిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

చిరుపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

హీరోయిన్‌లపై దాసరి చేసిన వ్యాఖ్యలకు కొద్ది నెలల క్రితం రామ్ చరణ్ తేజ కౌంటర్ ఇచ్చారు. దీనిని ఉద్దేశించే దాసరి కొందరు తనను ఛాలెంజ్ చేస్తున్నారనే వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని అంటున్నారు.

 చిరుపై దాసరి ఘాటు వ్యాఖ్యల వెనుక..!?

సూపర్ స్టార్‌ను మించినది లేదని చెప్పడం చిరంజీవిని ఉద్దేశించే అని భావిస్తున్నారు. చిరంజీవిని మెగాస్టార్ అంటారు.

దాసరికి శిష్యుడిగా పేరుబడిన కలెక్షన్ కింగ్ కూడా మోహన్ బాబు కాంగ్రెసులోకి చిరంజీవి వచ్చాక దాసరికి సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో దాసరి స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేశారనే వాదన ఉంది. కాంగ్రెసులో ఇన్నాళ్లు తనకు ప్రాధాన్యత ఇచ్చి చిరంజీవి వచ్చాక తన ప్రాధాన్యత గుర్తించక పోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు.

కొందరు తనను ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగారని... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజను ఉద్దేశించి దాసరి అని ఉంటారని అంటున్నారు. గతంలో దాసరి హీరోయిన్లు ఫంక్షన్లకు రావడం లేదని ఓ కార్యక్రమంలో అన్నారు. ఆ తర్వాత చెర్రీ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ.. హీరోయిన్లు ఫంక్షన్లకు వస్తున్నారని దాసరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అప్పుడే రామ్ చరణ్ తేజ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌లు మాత్రమే ఉంటారని, ఇతర స్టార్‌లు ఉండరని చెప్పడం ద్వారా చిరంజీవిని టార్గెట్ చేసి ఉంటారని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+