జగన్‌కు జైలా, బెయిలా: సోమవారం హైకోర్టు

వివిధ కేసుల్లో సిబిఐ జగన్ ఆరెస్టును చూపించిందని, కేవలం వాన్‌పిక్ వ్యవహారంలో మాత్రమే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు దర్యాప్తు సంస్థ చేస్తున్న వాదనలో నిజం లేదని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారున. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తన తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
ఇదిలావుంటే, జగన్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. వాన్‌పిక్ కేసులో జగన్ అరెస్టు చేసినట్లు చెప్పారు ఈ కేసులో ఐదు అంశాలపై దర్యాప్తు పూర్తయి తర్వాతనే బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు.
ఆ తర్వాత హైకోర్టు విచారణను గురువారంనాటికి వాయిదా వేసింది. స్టాట్యూటరీ గురించి సుప్రీంకోర్టులో వాదించినట్లు చెబుతున్న సిబిఐ వాదనలను జగన్ తరఫు న్యాయవాది పద్మనాభరెడ్డి విభేదించారు. సిఆర్పిసి సెక్షన్ 167(2) కింద తనకు చట్టబద్ద బెయిల్‌ను మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications