ప్రజాభిప్రాయం ఎవరైనా గౌరవించాలి: తెలంగాణపై చిరు

కేవలం కాంగ్రెసు పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని గతంలోనే చెప్పారని తెలిపారు. చిరంజీవితో పాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ కూడా నల్గొండలో పర్యటించారు.
కేంద్రమంత్రులు ముగ్గురు రూ.240 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. హుజూర్ నగర్‌లో మూడు వేల ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు. కాగా ప్రగతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. జనాలు మెగాస్టార్‌ను చూసేందుకు ఎగబడటంతో కొద్దిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications