తెలంగాణ కాదు, విద్యుత్తే పెద్ద సమస్య: ముఖ్యమంత్రి

Kiran Kumar Reddy
విశాఖపట్నం: రాష్ట్రంలో తెలంగాణ సమస్య కన్నా విద్యుత్తు సమస్యనే పెద్దది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమస్య కంటే విద్యుత్ సమస్యను అధిగమించడమే కీలకంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నట్లు సమాచారం. శుక్రవారం కాకినాడ పర్యటనకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో విశాఖ విమానాశ్రయంలో కొద్దిసేపు మంత్రులు, శాసనసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సమస్య చర్చకు వచ్చింది.

రాష్ట్రంలో విద్యుత్తు సమస్య కారణంగా చిన్నాచితకా కుటుంబాలకు ఎటువంటి నష్టం లేదని, కేవలం పెద్ద పరిశ్రమలకే ఇబ్బందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో విద్యుత్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నా, ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాకపోవడం వల్లనే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలకు సంబంధించి మార్చి దాటే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రజలకు నిజం తెలియజేయాల్సి ఉందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

గ్యాస్, బొగ్గు కొరత వల్ల విద్యుత్తు సమస్య తీవ్రమైందని, రిలయన్స్ నుంచి ర్రాష్టానికి రావాల్సిన వాటా దక్కినట్టయితే భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు తలెత్తవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడామని, అవసరమైతే కోర్టుని ఆశ్రయించినా మనకు న్యాయం జరిగే అవకాశముందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+