ఎమ్మెల్యే ఉషారాణి కుమారుడి హత్య, మిత్రుడి పనే

అందిన సమాచారం ప్రకారం - వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. వీరబాబు, జీవన్ కారులో రాజమండ్రి నుంచి రావులపాలెం బయలుదేరారు. మూలస్థానం వద్దకు వచ్చిన తర్వాత వీరబాబు జీవన్‌ను కత్తితో పొడిచి శవాన్ని బయటకు తోసేశాడు. ఆ తర్వాత రావులపాలెం చేరుకుని పోలీసులకు కత్తితో సహా లొంగిపోయాడని సమాచారం. తమకు మూలస్థానం వద్ద శవం పడి ఉన్నట్లు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని, తాము వెళ్లి చూసి శవాన్ని గుర్తించామని పోలీసులు అంటున్నారు. హత్య ఎవరు చేశారు, ఎంత మంది చేశరానే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు అంటున్నారు.
జీవన్ రాజమండ్రిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉషారాణి రెండో కుమారుడైన జీవన్ దత్తతకు వెళ్లినట్లు చెబుతున్నారు. శ్రీజీవన్ హత్య జరిగిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications