గర్నాథ్ రెడ్డిపై ఫిర్యాదులు, మన హైదరాబాద్ కూడా

తెలంగాణ ఇస్తే విధ్వంసం, రక్తపాతం సృష్టిస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు గుర్నాథరెడ్డిపై హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. తెరాస ప్రతినిధులు బంజారాహిల్స్ స్టేషన్‌లోను, న్యాయవాద జెఎసి సభ్యులు జూబ్లీహిల్స్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేశారు. గుర్నాథరెడ్డిపై ఐపీసీ 153(ఏ), 153(బీ), 504, 505(2) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెరాస నాయకుడు శ్రవణ్ నేతృత్వంలో ప్రతినిధులు కోరారు.
శానససభ్యుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన నిలదీశారు. చిన్నచిన్న నేరాలు చేసిన వారిని అరెస్ట్‌చేసే పోలీసులు, రక్తపాతం సృష్టిస్తామని వ్యాఖ్యలుచేస్తే ఎలా ఊరుకున్నారని మండిపడ్డారు. తెలంగాణవాదంపై గౌరవం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఏం చెబుతారని, గౌరవం అంటే రక్తపాతం సృష్టించడమేనా అని అడిగారు.
శాసనసభ్యుడు గురునాథరెడ్డిపై 153(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని అడ్వకేట్ జేఏసీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యతగల ప్రజాప్రతినిధి రెచ్చగొట్టేలా వాఖ్యానించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో అన్నారు. ప్రత్యేకరాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైల్లో ఉండి మంత్రాంగం చేస్తున్నారని జేఏసీ నాయకుడు కె గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.
మజ్లీస్‌తో పొత్తు పెట్టుకొని మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గురున్నాథరెడ్డితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications