తెలంగాణపై మాటమార్చిన దానం: హైదరాబాద్‌పై వివరణ

తాము ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. హైదరాబాదు ప్రజలు తెలంగాణకు వ్యతిరేకం అన్న ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణ కోసం మొదట నాయకత్వం వహించిందే తాను అన్నారు. గతంలో 41 మంది ఎమ్మెల్యేలచే సంతకాల చేయించి ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన వారిలో తాను ముందు ఉన్నానని అన్నారు. తానే ముందు సంతకం చేశానని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తాను సమాజిక తెలంగాణను కోరుకుంటున్నానని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధిలు ఎంత త్వరగా రాజీనామా చేస్తే తెలంగాణకు అంత మంచిదన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వల్లనే తెలంగాణ ఉద్యమం మరింత వేడెక్కిందని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేస్తేనే మంచిదన్నారు. ఇప్పుడున్న సీమాంధ్ర నేతలు ఎవరూ గెలవరని, అందుకే వారు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు అడ్రసులు గల్లంతవుతాయన్నారు.
హైదరాబాదు యుటి అంటే ప్రత్యేకం
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం జరిగితే తాను దానికి స్పందనగా అవసరమైతే ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం అన్నానని, అంతేగానీ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. కేంద్రపాలిత ప్రాంతం అంటేనే ప్రత్యేక రాష్ట్రం అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.
ఢిల్లీకి తెలంగాణ నేతలు
ఢిల్లీలో విభజన వేడి రాజుకుంది. ఇప్పటికే సీమాంధ్ర నేతలు సమైక్యం కోసం ఢిల్లీ పెద్దలను వరుసగా కలుస్తున్నారు. ఈరోజు పలువురు తెలంగాణ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. వారు అధిష్టానాన్ని కలిసి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని కోరనున్నారు. మంత్రులు బస్వరాజు సారయ్య, డికె అరుణ, జానా రెడ్డి, శ్రీధర్ బాబు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ కోసం తాము పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తామని చెప్పారు. తమ తెలంగాణ వాణిని వినిపించేందుకే తాము ఢిల్లీకి వచ్చామని చెప్పారు.












Click it and Unblock the Notifications