సంతృప్తిపర్చండి లేదా ఆగండి: జగన్ బెయిల్‌పై హైకోర్టు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన మంగళవారం ఉదయం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. నిరంజన్ వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని బెయిల్ పిటిషన్ పైన మీ వాదనలతో తమను సంతృప్తి పర్చగలరా అని ప్రశ్నించారు.

అందుకు నిరంజన్ రెడ్డి కోర్టుకు సంతృప్తి కలిగేలా వాదనలు వినిపిస్తానని చెప్పారు. అందుకోసం జగన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు అరగంట పాటు అనుమతి ఇచ్చింది. అరగంట తర్వాత తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి. వాదనల సమయంలో జగన్ న్యాయవాది ఇతర అంశాలపై మాట్లాడారు. దీంతో న్యాయమూర్తి... జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించిందని గుర్తు చేశారు.

దాని ప్రకారమే వాదించాలని సూచించారు. అలా అయితే వాదనలు వినిపించండని లేదంటే సిబిఐ కోర్టులో తుది ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు ఆగాలని సూచించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు జగన్ అర్హతపై న్యాయమూర్తి స్పందించారు.

అర్హుడే కానీ సుప్రీం ఆదేశాలతో వాదనలు వినిపించాలని సూచించింది. వాదనలతో సంతృప్తిపర్చగలరా అంటే సరేనని జగన్ తరఫు లాయరు చెప్పారు. విచారణ అరగంట వాయిదా పడింది. సిబిఐ తరఫున అశోక్ బాన్ వాదనలు వినిపిస్తున్నారు. కాగా గతంలో సుప్రీం కోర్టు జగన్ రెగ్యులప్ పిటిషన్ పైన తీర్పు ఇస్తూ... సిబిఐ తుది ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+