కష్టంగా దర్యాఫ్తు, సహకారం లేదు: జగన్ కేసుపై సిబిఐ

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాఫ్తు కష్టంగా మారిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం చెప్పింది. జగన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది.. జగన్ ఆస్తుల కేసు దర్యాఫ్తుకు ఇంకా సమయం పడుతుందని కోర్టుకు చెప్పింది.

అందుకు కోర్టు ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని, దీంతో దర్యాఫ్తు కష్టంగా మారిందని నెలకు పదిహేను వినతులను పంపిస్తున్నామని అయినా సమాధానం రావడం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది. దీంతో కేసు విచారణకు ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టంగా మారిందన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొందని చెప్పారు.

కాగా అంతకుముందు జగన్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిరంజన్ వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని బెయిల్ పిటిషన్ పైన మీ వాదనలతో తమను సంతృప్తి పర్చగలరా అని ప్రశ్నించారు. అందుకు నిరంజన్ రెడ్డి కోర్టుకు సంతృప్తి కలిగేలా వాదనలు వినిపిస్తానని చెప్పారు. అందుకోసం జగన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు అరగంట పాటు అనుమతి ఇచ్చింది. అరగంట తర్వాత తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి.

వాదనల సమయంలో జగన్ న్యాయవాది ఇతర అంశాలపై మాట్లాడారు. దీంతో న్యాయమూర్తి... జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించిందని గుర్తు చేశారు. దాని ప్రకారమే వాదించాలని సూచించారు. అలా అయితే వాదనలు వినిపించండని లేదంటే సిబిఐ కోర్టులో తుది ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు ఆగాలని సూచించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు జగన్ అర్హతపై న్యాయమూర్తి స్పందించారు.

అర్హుడే కానీ సుప్రీం ఆదేశాలతో వాదనలు వినిపించాలని సూచించింది. వాదనలతో సంతృప్తిపర్చగలరా అంటే సరేనని జగన్ తరఫు లాయరు చెప్పారు. విచారణ అరగంట వాయిదా పడింది. సిబిఐ తరఫున అశోక్ బాన్ వాదనలు వినిపిస్తున్నారు. కాగా గతంలో సుప్రీం కోర్టు జగన్ రెగ్యులప్ పిటిషన్ పైన తీర్పు ఇస్తూ... సిబిఐ తుది ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది.

తీర్పు ఎల్లుండి

కాగా ఇరువైపుల వాదనలు మంగళవారం పూర్తయ్యాయి. హైకోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+