వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో వైఎస్ ప్రకటన: టికాంగ్, షిండే నవ్వు, మౌనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde-YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విభజన వేడి రోజు రోజుకు రాజుకుంటోంది. సీమాంధ్ర నేతలు ఢిల్లీ పెద్దల్ని కలిసి ఓ వైపు సమైక్యం కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు మంగళవారం ఢిల్లీకి వచ్చి ప్రత్యేకం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ నేతలు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతే మధ్యాహ్నం భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తాము షిండేకు వివరించామన్నారు.

తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, ప్రజల ఆవేదనను, ఆందోళనను అర్థం చేసుకోవాలని కోరామన్నారు. తాము తెలంగాణ తప్ప ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలను, ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించేది లేదని షిండేకు ఖరాఖండిగా చెప్పామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను తాము షిండేకు అందజేశామన్నారు. రోశయ్య కమిటీ ఏమాత్రం పని చేయలేదని తాము చెప్పామన్నారు.

తమ అభ్యర్థనను షిండే సావధానంగా విన్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణంలో తాము ఆయనకు అన్నింటిని వివరించామన్నారు. డిసెంబర్ 9 ప్రకటన అన్నీ ఆలోచించే కేంద్రం అప్పుడు చేసిందని చెప్పామన్నారు. 28లోగా విభజనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. షిండేకు రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉందని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు ఆయనకు తెలుసు అన్నారు. సీమాంధ్రలో నాయకులది ఉద్యమం అయితే తెలంగాణలో ప్రజలది అన్నారు. షిండే తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి నాడు అసెంబ్లీలో చేసిన ప్రకటన తెలంగాణకు అనుకూలంగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు.

షిండే మౌనం

తెలంగాణ ప్రాంత నేతలు చెబుతున్నంత సేపు సుశీల్ కుమార్ షిండే అన్నీ మౌనంగానే విన్నారని తెలుస్తోంది. మొదట వారు వెళ్లగానే షిండే ఓ నవ్వు నవ్వారని, ఆ తర్వాత వారు చెప్పిందంతా మౌనంగా విన్నారని, తెలంగాణ నేతలకు అవునని కానీ కాదని కాని సమాధానం చెప్పలేదు. కాగా ఆజాద్‌తో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు.

English summary
Telangana Congress leaders were met Central Home Minister Sushil Kumar Shinde on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X