మనోళ్లు బుద్ధితెచ్చుకోవాలి, అడ్డుపడ్తే అంతే: కోమటిరెడ్డి

ఈ నెల 28వ తేదిలోగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే తెలంగాణ మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామన్నారు. వారి పైన ఉద్యోగులు తిరగబడాలని సూచించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలన్నారు. కొద్దిమంది సీమాంధ్ర వ్యాపారులు తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ రాకుండే కాంగ్రెసు నేతలు రాజీనామా చేయకుంటే వారే మా టార్గెట్ అన్నారు. సీమాంధ్ర మీడియా పని గట్టుకొని తెలంగాణ ఉద్యమం పైన విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. ఉద్యమంపై మీడియా తన పద్ధతిని మార్చుకోకంటే ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ రాని పక్షంలో మిలిటెంట్ పోరాటాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో తనను విమర్శించడం సరికాదన్నారు. అవినీతి మంత్రులను వదిలి బాబు తనను టార్గెట్‌గా చేసుకోవడం సరికాదన్నారు.
జెఏసి అత్యవసర భేటీ
ఈ రోజు మూడు గంటలకు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి అత్యవసరంగా భేటీ కానుంది. 27వ తేదిన సమర దీక్ష పైన చర్చించనుంది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించనుంది.












Click it and Unblock the Notifications