హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్‌కు ఏమైనా ఐతే.: జైలు నుండి విడుదలైన అసద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
మెదక్: మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ వచ్చింది. సంగారెడ్డి కోర్టు అసద్‌కు గురువారం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. వరుసగా రెండు రోజులు ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వచ్చింది. రూ.10వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అసద్ సాయంత్రం జైలు నుండి విడుదలయ్యారు.

కాగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి సంగారెడ్డి కోర్టులో బుధవారం మరోసారి చుక్కెదురయిన విషయం తెలిసిందే. అసదుద్దీన్‌కు బెయిల్ కోసం మరోసారి ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి ఎక్సైజ్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట వారు ఈ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈసారి కూడా అసద్‌కు బెయిల్ లభించలేదు.

అసదుద్దీన్ బెయిల్ పిటిషన్‌ను సంగారెడ్డి కోర్టు మంగళవారం మొదటిసారి కొట్టి వేసిన విషయం తెలిసిందే. 2005లో మెదక్ జిల్లా కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో అసద్ సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత అతను కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని కోర్టు బుధవారం కొట్టేసింది.

2005లో మెదక్ జిల్లా కలెక్టర్ సింఘాల్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో అసదుద్దీన్ ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లో పరారీలో ఉన్నట్లుగా చూపించారు. కోర్టు అతనికి ఫిబ్రవరి 2వ తేది వరకు రిమాండ్ విధించింది. అసద్ ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్నారు.

2005లో పటాన్‌చెరు ముత్తంగి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రార్థనా మందిరాన్ని తొలగించినందుకు యత్నించిన అధికారులను ఓవైసీ సోదరులు అడ్డుకున్నారని కేసు నమోదయింది. కలెక్టర్‌ను, జెసిని అక్బర్ దుర్భాషాలాడారు. వారిపై 163ఏ, 147, 149, 341 సెక్షన్ల క్రింద పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అక్బర్ ఓసారి కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత హాజరు కాలేదు. అక్బర్ మరోసారి కోర్టుకు రాకపోవడంతో వారెంట్ పెండింగులో ఉంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ అరెస్టు కావడంతో పటాన్‌చెరు పోలీసులు పాత కేసును తిరగదోడారు.

విడుదలైన అసద్

తమపై వ్యక్తిగత కక్షతోనే కాంగ్రెసు ప్రభుత్వంపై తమను అరెస్టు చేసిందన్నారు. ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకముందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, వ్యక్తిగతంగా కాంగ్రెసును ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం బాగాలేదని, ఏమైనా జరిగితే కాంగ్రెసు పార్టీదే బాధ్యత అన్నారు. కాంగ్రెసు - బిజెపిల సంబంధాన్ని తాము ప్రజలకు వివరిస్తామన్నారు.

అక్బర్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

అదిలాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ ఓవైసీకి చుక్కెదురయింది. అదిలాబాద్ సెషన్స్ కోర్టు అక్బర్‌కు బెయిల్‌ను తిరస్కరించింది.

English summary
The Sangareddy court issued the bail to MIM chief and Hyderabad MP Asaduddin Owaisi on Thursday. He will release evening from the Sangareddy jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X