వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేట్ స్పీచ్ చిక్కు: అక్బర్‌కు బెంగళూరు కోర్టు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
బెంగళూరు: మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి వివాదాస్పద వ్యాఖ్యల కేసుల చిక్కు తప్పేలా లేదు. ఆయనపై పలుచోట్ల వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బెంగళులో కోర్టు అక్బరుద్దీన్‌కు సమన్లు జారీ చేసింది. అక్బరుద్దీన్ ఓ వర్గం వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఒకరు బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పైన స్పందించిన కోర్టు అక్బరుకు సమన్లు జారీ చేసింది.

ఫిబ్రవరి 23వ తేదిన బెంగళూరు కోర్టులో హాజరు కావాలని అందులో ఆదేశించింది. బెంగళూరు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. అలాగే పిటిషన్ పైన విచారించిన కోర్టు అక్బరుద్దీన్ పైన కేసును నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. మరోవైపు అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్ పైన ఎపిలోని అదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టులో విచారణ జరగనుంది.

కాగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి ఎపిలోని మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో బుధవారం మరోసారి చుక్కెదురయిన విషయం తెలిసిందే. అసదుద్దీన్‌కు బెయిల్ కోసం మరోసారి ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి ఎక్సైజ్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట వారు ఈ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈసారి కూడా అసద్‌కు బెయిల్ లభించలేదు.

అసదుద్దీన్ బెయిల్ పిటిషన్‌ను సంగారెడ్డి కోర్టు మంగళవారం మొదటిసారి కొట్టి వేసిన విషయం తెలిసిందే. 2005లో మెదక్ జిల్లా కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో అసద్ సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత అతను కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని కోర్టు ఈ రోజు కొట్టేసింది. 2005లో మెదక్ జిల్లా కలెక్టర్ సింఘాల్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు.

ఈ కేసులో అసదుద్దీన్ ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లో పరారీలో ఉన్నట్లుగా చూపించారు. కోర్టు అతనికి ఫిబ్రవరి 2వ తేది వరకు రిమాండ్ విధించింది. అసద్ ప్రస్తుతం సంగారెడ్డి కోర్టులో ఉన్నారు. 2005లో పటాన్‌చెరు ముత్తంగి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రార్థనా మందిరాన్ని తొలగించినందుకు యత్నించిన అధికారులను ఓవైసీ సోదరులు అడ్డుకున్నారని కేసు నమోదయింది. కలెక్టర్‌ను, జెసిని అక్బర్ దుర్భాషాలాడారు.

వారిపై 163ఏ, 147, 149, 341 సెక్షన్ల క్రింద పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అక్బర్ ఓసారి కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత హాజరు కాలేదు. అక్బర్ మరోసారి కోర్టుకు రాకపోవడంతో వారెంట్ పెండింగులో ఉంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ అరెస్టు కావడంతో పటాన్‌చెరు పోలీసులు పాత కేసును తిరగదోడారు.

English summary
A Bangalore Metropolitan magistrate court yesterday directed the Bangalore police to probe against MIMLP Akbaruddin Owaisi for allegedly making objectionable remarks insulting Hindus and Hindu gods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X