వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: రోశయ్యనుండి సోనియా ఫీడ్‌బ్యాక్! కిరణ్ బిజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Rosaiah
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఆరా తీసినట్లుగా ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అంశం, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం పిలిపించిన విషయం తెలిసిందే. కిరణ్ ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలను కలిశారు. కిరణ్ ఢిల్లీ పర్యటన సమయంలోనే రోశయ్య ఢిల్లీలో ఉండటం చర్చకు తావిస్తోంది.

రోశయ్య ఎపి రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండటం, సీనియర్ కాంగ్రెసు నేత కావడం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ముఖ్యమంత్రిగా ఆయనే ఉండటం... తదితర కారణాలతో ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో తెలంగాణ ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వకుంటే ఏం జరుగుతుంది? ఏం చేయాలి? ఎలా చేస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయి? తదితర అంశాలపై సోనియా చర్చించి ఉంటారని అంటున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని ఉండి ఉంటారని అంటున్నారు.

ముఖ్యమంత్రి బిజీ బిజీ

అధిష్టానంతో చర్చించేందుకు వెళ్లిన కిరణ్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఆయన వరుసగా నేతలతో సమావేశమవుతున్నారు. ఉదయం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత సోనియా గాంధీతో గంటకు పైగా చర్చించారు. అనంతరం కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ప్రణబ్‌తో ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు.

అందరితోనూ జరిగిన చర్చల్లో తెలంగాణ, జగన్ అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రణబ్‌తో భేటీలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చించినట్లుగా సమాచారం. రెండు ప్రాంతాలకు సంబంధించిన అంశాలు కిరణ్ నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సహకార ఎన్నికల్లో పార్టీ గెలుపుపై నివేదిక ఇచ్చారు. కాగా కిరణ్ ఈ రోజు రాత్రి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కానున్నారు.

ఢిల్లీలో పొన్నాల, కన్నా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

English summary

 CM Kiran Kumar Reddy met AICC president Sonia Gandhi, President Pranab Mukherjee and Central Minister Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X