'జైలర్ 2'లో హృతిక్ రోషన్.. 40 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో!

స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'జైలర్' కంటే సీక్వెల్ 'జైలర్ 2'ను అన్ని విధాలా మరింత భారీగా, అద్భుతంగా తెరకెక్కించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టారో హీరోలను తీసుకొచ్చి మ్యాజిక్ చేసిన నెల్సన్.. ఇప్పుడు పార్ట్-2లో అంతకుమించిన క్రేజీ కామియోలను ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఈ నెల చివర్లోనే చెన్నైలో జరగనుందని సమాచారం. నిజానికి ఈ క్యారెక్టర్ కోసం మొదట షారూఖ్ ఖాన్‌ను సంప్రదించగా.. చివరి నిమిషంలో ఆయన తప్పుకోవడంతో హృతిక్ రోషన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చింది.. నటిపై డైరెక్టర్ ఫైర్!
డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చింది.. నటిపై డైరెక్టర్ ఫైర్!

ఈ క్రేజీ కాంబినేషన్ గనుక నిజమైతే.. దాదాపు 4 దశాబ్దాల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. గతంలో 1986లో రిలీజ్ అయిన 'భగవాన్ దాదా' సినిమాలో రజనీకాంత్‌తో కలిసి హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం సినీ ప్రియులకు కనువిందు చేయనుంది. అయితే హృతిక్ పోషించబోయేది కేవలం వచ్చిపోయే సాధారణ పాత్ర కాదట. కథలో అత్యంత కీలకమైన మలుపులో ఆయన క్యారెక్టర్ ఇంట్రీ ఇస్తుందని.. రజనీకాంత్ పాత్రను ముందుకు నడిపించడంలో ఈ క్యారెక్టర్ ఎంతో కీలకంగా మారుతుందని టాక్. ఈ పాత్ర కోసం హృతిక్ రోషన్‌కు ఓ సరికొత్త మేకోవర్‌ను ప్లాన్ చేస్తున్నారట.

Jailer 2 Hrithik Roshan Confirmed for a Powerful Cameo in Rajinikanth and Nelson Sequel Details
ముంచేసిన 'పెద్ది' వివాదం: ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టిన జాన్వీ?
ముంచేసిన 'పెద్ది' వివాదం: ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టిన జాన్వీ?

దీనిని బట్టి చూస్తే 'జైలర్ 2'ను కేవలం ఓ రజనీకాంత్ చిత్రంగానే కాకుండా ఓ పక్కా పాన్ ఇండియా ఈవెంట్ సినిమాగా నెల్సన్ డిజైన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి వంటి విభిన్న పరిశ్రమలకు చెందిన దిగ్గజ నటుల పేర్లు వినిపిస్తుండగా.. ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా చేరడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి భాగంలో ఈ కామియోల ఫార్ములా అద్భుతంగా వర్కవుట్ అయ్యి, తమిళ సినిమా పరిధిని దాటి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు సీక్వెల్ కోసం కూడా నెల్సన్ అదే పంథాను మరింత భారీగా ఫాలో అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+