జూన్ 17న 'ధ్రువ యోగం'.. మేషం, సింహం, ధనుస్సువారికి కనక వర్షం
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, నక్షత్రాల కలయిక వల్ల ఏర్పడే కొన్ని యోగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఒక శక్తివంతమైన, అత్యంత అరుదైన 'ధ్రువ యోగం' ఈ జూన్ 17న ఏర్పడబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకురావడమే కాకుండా, దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ చెక్ పెట్టబోతోంది. ధ్రువ యోగం అంటేనే స్థిరత్వానికి, విజయానికి సంకేతం. ఈ కాలంలో ప్రారంభించే పనులు లాభసాటిగా సాగడమే కాకుండా, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ యోగం పట్టిందల్లా బంగారమే అవనుంది.
మేష రాశి వారికి ఆర్థిక ఊరట
మేష రాశి వారికి ధ్రువ యోగం కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా ఊహించని అద్భుతాలను మోసుకొస్తోంది. వ్యాపారాల్లో ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మొండిబాకీలు, ఎక్కడో నిలిచిపోయిన డబ్బులు తిరిగి మీ చేతికి అందుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం, దీనివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాస్‌ల నుంచి ప్రత్యేక ప్రశంసలు, మద్దతు లభిస్తాయి.

సింహ రాశి వారికి పెరగనున్న గౌరవం
ధ్రువ యోగం ప్రభావంతో సింహ రాశి వారి జాతకం ఒక్కసారిగా మారిపోనుంది. జూన్ 17 తర్వాత మీకు అదృష్టం నూటికి నూరు శాతం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు చాలా సులభంగా పూర్తి అవుతాయి. భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీలో ఉత్సాహం, నూతన శక్తి రెట్టింపవుతాయి.
ధనుస్సు రాశి వారికి మానసిక ప్రశాంతత
గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న ధనుస్సు రాశి వారికి ఈ యోగం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. లౌకిక సుఖాలు, సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. యువ ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు ఈ కాలంలో సాకారం అవుతాయి. కొత్త వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేసే యోగం కూడా ఉంది.












Click it and Unblock the Notifications