అల్లు అరవింద్ 'ఓయో రూమ్స్' కామెంట్స్.. నెట్టింట రచ్చ రచ్చ!

టాలీవుడ్ అగ్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకే వేదికపై కలిస్తే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా 'దీవానా' చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక ఈవెంట్లో వీరిద్దరూ సందడి చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ తనదైన శైలిలో అల్లు అరవింద్‌పై ప్రశ్నల వర్షం కురిపించగా.. దానికి అల్లు అరవింద్ కూడా అంతే హుందాగా, కాస్త వెటకారంగా సమాధానాలిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ముంచేసిన 'పెద్ది' వివాదం: ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టిన జాన్వీ?
ముంచేసిన 'పెద్ది' వివాదం: ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టిన జాన్వీ?

నిర్మాతలకు జుట్టు ఊడట్లేదేంటి?
ఈ ఈవెంట్లో విశ్వక్ సేన్ అల్లు అరవింద్‌ను ఓ ఫన్నీ ప్రశ్న అడిగి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. "సాధారణంగా ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించే కొద్దీ టెన్షన్ల వల్ల నిర్మాతలకు జుట్టు ఊడిపోతుంటుంది. కానీ గీతా ఆర్ట్స్ నిర్మాతలు మాత్రం రోజురోజుకూ మరింత స్మార్ట్‌గా, గ్లామర్‌గా తయారవుతున్నారు. అసలు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్?" అని విశ్వక్ సేన్ ప్రశ్నించాడు. దీనికి అల్లు అరవింద్ నవ్వుతూ, వాళ్లు నిర్మాతగా మారిన తర్వాతే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

Allu Aravind Oyo Rooms Comments Go Viral Vishwak Sen Asks Fun Questions at Deewana Event

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో విశ్వక్ సేన్ సినిమా
ఇదే క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తనకు నటించే అవకాశం ఇవ్వాలని విశ్వక్ సేన్ కోరాడు. అవసరమైతే తన మొదటి సినిమా రోజుల్లో లాగా మళ్లీ వచ్చి ఆడిషన్ ఇస్తానని చెప్పాడు. దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. "నువ్వు ఆడిషన్ ఇస్తావు కానీ.. ఈ మధ్య నువ్వు రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా అడుగుతున్నావటగా" అని విశ్వక్ సేన్‌కు కౌంటర్ ఇచ్చారు. దానికి విశ్వక్ తడుముకోకుండా.. "మీ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి కదా సార్.. మాలాంటి వాళ్లకు కొంచెం పంచండి.. ఇండస్ట్రీ బాగుంటుంది. అయినా ఈ థియేటర్ మీదే.. మీరు కూర్చున్న ఈ కుర్చీ కూడా మీదే" అంటూ సమయస్ఫూర్తితో సమాధానమిచ్చి నవ్వులు పూయించారు. అంతేకాకుండా దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో ఒక స్టూడియో కట్టాలని, అందుకు తన స్థలాన్ని ఇస్తానని కూడా విశ్వక్ సేన్ ఈ సందర్భంగా ఆఫర్ చేశారు.

వన్డేల్లో ఐపీఎల్ రేంజ్ బ్యాటింగ్.. బుడ్డోడి ఊచకోత !
వన్డేల్లో ఐపీఎల్ రేంజ్ బ్యాటింగ్.. బుడ్డోడి ఊచకోత !

లవ్.. షాపింగ్.. చివర్లో ఓయో రూమ్స్!
ఇక 'దీవానా' సినిమాకు 'వన్ సైడ్ లవ్' అనే ట్యాగ్‌లైన్ ఉండటంతో.. విశ్వక్ సేన్ అల్లు అరవింద్‌ను మీ జీవితంలో ఉన్న వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి చెప్పమని అడిగారు. దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. "నా జీవితంలో వన్ సైడ్ లవ్ స్టోరీలు ఒకటా.. రెండా..? లెక్కలేనన్ని ఉన్నాయి" అని సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ప్రస్తుత తరం ప్రేమికులపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

"ఈ రోజుల్లో లవ్ స్టోరీ అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రేమికులు కలవడం.. ఖాళీగా ఉన్న థియేటర్లకు వెళ్లడం.. ఆ తర్వాత షాపింగ్‌లు చేయడం.. చివరకు ఓయో రూమ్‌లో ల్యాండ్ అవ్వడం.. ఇదే కదా ఇప్పుడు నడుస్తున్న లవ్ స్టోరీస్" అంటూ అల్లు అరవింద్ ప్రస్తుత పరిస్థితులను కాస్త వెటకారంగా ఎద్దేవా చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ నోటి నుంచి ఓయో రూమ్స్ అనే మాట రావడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కాగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై హీరోహీరోయిన్లుగా నటించిన 'దీవానా' చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిన్న సినిమాకు అల్లు అరవింద్, విశ్వక్ సేన్ ప్రమోషన్స్ చేయడంతో ట్రేడ్ వర్గాల్లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+