ఆరు నెలల తర్వాత అధికారిక సమావేశానికి ధర్మాన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ వాన్‌పిక్ వ్యవహారంపై కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాదరావును ఐదో నిందితుడిగా చేర్చింది. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను తిరస్కరిస్తూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తీర్మానం చేసి, దాన్ని గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ ఆ ఫైల్ తిరిగి ప్రభుత్వానికి పంపించారు.
ఆ తర్వాత కూడా ధర్మాన ప్రసాదరావు రాజీనామా పెండింగులోనే ఉంది. రాజీనామా చేసినప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావు అధికారిక కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఒకటి రెండు సార్లు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినప్పటికీ తన ఛేంబర్‌కు వెళ్లలేదు. సచివాలయం వెలుపల జరిగిన కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శానససభా సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు. ఆ స్థితిలో ఆయన గురువారం అధికారిక సమావేశానికి హాజరయ్యారు.
ధర్మాన తమ మంత్రివర్గ సహచరుడేనని మంత్రి రామనారాయణ గురువారంనాడు వ్యాఖ్యానించారు. ధర్మాన ప్రసాదరావు నిరుడు ఆగస్టు 14వ తేదీన తన పదవికి రాజీనామా లేఖ సమర్పించారు. ఎన్ఎసి బోర్డు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండగా, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications