హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డమంటూ కెసిఆర్‌పై నాగం ఫైర్: లగడపాటిపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ నగారా సమితి నాయకుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. తనను తెలంగాణ జెఎసిలోకి రానీయకుండా కెసిఆర్ ఆడ్డుకుంటున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారు గానీ తెలంగాణ కోసం కాదని ఆయన అన్నారు.

తెలంగాణ పేరుతో తెరాస ఓట్ల రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఒక ఉద్యమ పార్టీగా అది పనిచేయడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఐక్య ఉద్యమం జరగాల్సి ఉండగా, సమాంతర ఉద్యమం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణవాదుల మధ్య విభజన తెచ్చి ప్రయోజనం పొందేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెరాస కార్యవర్గ సమావేశంలో తెలంగాణ విద్యార్థుల ఆత్మబలిదానాలను ఎజెండాలో ఎందుకు చేర్చలేదని ఆయన అడిగారు. రైల్వే లైన్లపై, సిలిండర్లపై తీర్మానాలు చేసిన తెరాస కార్యవర్గం ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ యువతను కోరుతూ తీర్మానం చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు మంత్రులు బడ్జెట్‌ను బహిష్కరించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వస్తే బుద్ధి చెప్తామని ఆయన అన్నారు.

వేర్పాటువాదులు దేశం విడిచి వెళ్లాలని వ్యాఖ్యానించినందుకు కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఉపేంద్ర అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో లగడపాటిపై 121, 153, 153 ఎ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయంపై దర్యాప్తు చేసి మార్చి 7వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని కోర్టు చైతన్యపురి పోలీసులను ఆదేశించింది.

English summary
Telangana Nagara Samithi leader and MLA Nagam Janardhan Reddy has blamed Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao for lack of united movement to achieve statehood for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X