గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌కు బాబు సవాల్: వైఎస్ అప్పులంటే జగన్‌కు కోట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ కుదరదని కిరణ్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. రైతుల పరిస్థితి తమ పాలనలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తుందన్నారు.

రుణమాఫీ సాధ్యం కాదన్న కిరణ్‌కు ఏం అనుభవం ఉందన్నారు. టిడిపి వస్తే రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. రైతులకు కిరణ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన అనుభవం ఎంత? అన్నారు. కిరణ్ వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నీలం తుఫాను, వరదల వల్ల రైతులు నష్టపోయినా కేంద్రం నుండి నిధులు తీసుకు రావడంలో విఫలమయ్యారన్నారు. ఇది ఆయన చేతకానితనానికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు గజదొంగ పార్టీలు అని మండిపడ్డారు. కాంగ్రెసు, జగన్ అధికారంలోకి వస్తే ఊర్లను కూడా అమ్మేస్తారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓటేయవద్దన్నారు. రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 2014లో టిడిపి గెలుపు ఖాయమన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందన్నారు. కిరణ్ అందరిపై తప్పుడు కేసులు పెట్టి ఆనందిస్తున్నారన్నారు.

సిఎం వ్యవసాయం గురించి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. డబ్బు నిర్వహణ తప్ప నీటి, విద్యుత్ నిర్వహణలో ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. 2004కు ముందు వైయస్కా రాజశేఖర రెడ్డి అప్పుల్లో ఉన్నారని, బంజారాహిల్స్‌లో ఉన్న ఇల్లును అమ్మేందుకు అనుమతివ్వాలని తనకు లేఖ రాశారని కాని, అది కబ్జా చేసిన స్థలం అని తెలిసి తాను అనుమతివ్వలేదని చంద్రబాబు అన్నారు.

ఇంత తక్కువ కాలంలో వైయస్ కుటుంబం ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలన్నారు. జగన్ పార్టీకి నిర్మాణం లేదని, నిలిచే పార్టీ కాదన్నారు. కాగా గుంటూరులో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా పెదకాకాని కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has challenged CM Kiran Kumar Reddy on farmers issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X