చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ డైరెక్టర్ల రాజీనామా!: సిఎంపై భూమన ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy
చిత్తూరు: తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల వివాదం కొత్త మలుపు తిరిగింది! టౌన్ బ్యాంకు ఎన్నికల రీకౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆదివారం ఫలితాలు ప్రకటించారు. కాంగ్రెసు ఆరు, వైయస్సార్ కాంగ్రెసు మూడు, తెలుగుదేశం ఒకటి, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందినట్లుగా ప్రకటించారు. అయితే, ఎన్నికలు మొదలు అంతా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆదివారమే ఆందోళనకు దిగాయి.

సోమవారం ఇది కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. రాజీనామాకు సిద్ధపడిన వారిలో ప్రభాకర్ రెడ్డి, నారాయణ, వెంకటేశ్వర రెడ్డిలు ఉన్నారు. టౌన్ బ్యాంకు ఎన్నికల అక్రమాలపై తాము సొసైటీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

కిరణ్‌పై భూమన నిప్పులు

టౌన్ బ్యాంకు ఎన్నికల్లో అధికార కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడిందని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన వారే ఎక్కువమంది అభ్యర్థులు గెలిచినప్పటికీ ఓడినట్లుగా అధికారులు ప్రకటించారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం ఒత్తిడి మేరకే అధికారులు గెలిచిన తమ అభ్యర్థులు ఓడినట్లుగా ప్రకటించారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీచ రాజకీయాలకు ఈ ఎన్నికలు నిదర్శనం అని దుయ్యబట్టారు.

English summary
Tirupati MLA Bhumana Karunakar Reddy has lashed out at CM Kiran Kumar Reddy for Tirupati town bank elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X