బాలికను హత్య చేసిన ఉన్మాది, అతన్ని కొట్టి చంపారు

 Four year old girl killed
అనంతపురం: ఓ నాలుగేళ్ల చిన్నారిని ఓ ఉన్మాది కత్తితో గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణంపై ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఉన్మాదిని వెంటాడి చితకబాదారు. దీనితో హంతకుడు కూడా మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామానికి చెందిన అంగడి గోవిందప్ప కూతురు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. తన వెంట రెండవ కుమార్తె దీపికను తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం అంగనవాడీ కేంద్రంలో పంపిణీ చేసే పిండి కోసం దీపిక తన ఈడు పిల్లలతో కలిసి వెళ్లింది. పిల్లలంతా పిండి అందుకునే సందడిలో ఉండగా అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ పేరప్ప (50) అనే ఉన్మాది అకస్మాత్తుగా చొరబడి బీభత్సం సృష్టించాడు.

కత్తి చేతబట్టి చిన్నారుల వెంట పడ్డాడు. పిల్లలంతా అరుపులు కేకలతో పారిపోతుండగా దీపిక ఉన్మాదికి దొరికిపోయింది. కత్తితో గొంతు కోశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ సంఘటనపై గ్రామస్తులంతా ఆగ్రహానికి గురయ్యారు. ఉన్నాది పేరప్పను వెంటాడి పిల్లలపల్లి బస్టాండులో పట్టుకున్నారు. చితకబాది చంపేశారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కుటుంబ సభ్యులను వేధించడం, భార్యపై వేధింపులు, కుమారుడిపై హత్యాయత్నం కేసుల్లో శ్రీనివాసరావు పలుసార్లు జైలుకు వెళ్లాడు. మితిస్థిమితం లేదని వదిలేశామని చెబుతున్న గ్రామస్తులు చిన్నారి దీపిక మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+