అఫ్జల్ గురు ఉరి: అత్యంత గోప్యంగా ఆపరేషన్ త్రీ స్టార్

హోంమంత్రిత్వ శాఖ, తీహార్ జైలుకు చెందిన కొంతమంది ఉన్నతాధికారులకు మాత్రమే ఈ ఆపరేషన్ గురించి తెలుసు. ఆపరేషన్‌కు సంబంధించి ప్రతి విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో అఫ్జల్ గురు ఉరి విషయం బయటకు పొక్కలేదు. ఆపరేషన్‌లో పాల్గొన్న వారంతా పూర్తి రహస్యాన్ని పాటించారు. మంగళవారం ప్రారంభమైన ఆపరేషన్ శనివారం ఉరితీతతో ముగిసింది. ఆపరేషన్ పూర్తిగా విజయవంతమయ్యాకే విషయం బయటకు తెలిసింది.
కాగా అంతకుముందు ముంబై మారణ హోమం నిందితుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలకు 'ఆపరేషన్‌కు ఎక్స్' అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. కసబ్‌ను 21 నవంబర్ 2012 ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అత్యంత గోప్యంగా పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. దీని అమలుకు ఆపరేషన్ ఎక్స్ అనే పేరును పెట్టారు. ఆపరేషన్ ఎక్స్ ప్రత్యేక లా అండ్ ఆర్డర్ ఐజి దేవన్ భారతి నేతృత్వంలో గప్‌చుప్‌గా సాగిపోయింది.
ఉదయం ఏడున్నరకు అజ్మల్ కసబ్‌ను ఉరి తీశారనే వార్త కేవలం భారత్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. దేవన్ భారతి నేతృత్వంలో ఆపరేషన్ ఎక్స్ నవంబర్ 5వ తారీఖు నుండి ప్రారంభమైంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అదే రోజు తిరస్కరించారు. ఆ తర్వాత నుండి దేవన్ జట్టు తమ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా ప్రారంభించింది.
ఈ ఆపరేషన్‌లో దేవన్ భారతితో సహా పదిహేడు మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులందరి ఫోన్‌లు ఆపరేషన్ ప్రారంభం అయినప్పటి నుండి స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. కేవలం దేవన్ భారతి ఫోన్ మాత్రమే పని చేసినట్లుగా సమాచారం. కసబ్‌ను ముంబై జైలు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించే బాధ్యతను దేవన్ భారతి అండ్ కో సమర్థవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్ ఎక్స్ పూర్తయ్యే వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం అందలేదు. ఈ రోజు ఉదయం కసబ్‌ను ఉరి తీసిన తర్వాత దేవన్ భారతి ''ఆపరేషన్ ఎక్స్ విజయవంతంగా పూర్తయింద''ని సందేశమిచ్చారు. ఆ తర్వాత అది వెలుగులోకి వచ్చింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications