పక్కా స్కెచ్‌తో హత్య: సీరియస్‌గా తీసుకున్నాం.. మంత్రి

దినకర్ రెడ్డి భార్య శకుంతలను హత్య చేసి ఇంట్లోని బంగారం, నగదు దోచుకెళ్లాలని భావించారు. రెండు రోజుల క్రితం ప్లాన్ వేసుకున్నప్పటికీ దినకర్ రెడ్డి లేని సమయంలో దోచుకెళ్లాలని భావించినప్పటికీ అది కుదరదేలన్నారు. మంగళవారం ఇంటిపై దాడి చేసి భార్గవి, శకుంతల, దినకర్ రెడ్డిలపై కత్తులతో దాడి చేశారన్నారు.
కాగా నిన్న జరిగిన దాడి ఘటనలో భార్గవి, శకుంతలలు మృతి చెందగా దినకర్ రెడ్డి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు వారి నుండి లక్షా ఇరవై వేల రూపాయలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతియాజ్, మురళీ మనోహర్, వంశీకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
హైదరాబాదులో హుక్కా సెంటర్లపై దాడి
హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉన్న హుక్కా సెంటర్లపై పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో ఒక మహిళ సహా పద్నాలుగు మంది మైనర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications