మాల్దీవుల్లో ఇండియన్ రేప్: ముంబైలో భోజనమని చెప్పి

బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని మినివాన్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని ఐలాండ్ కౌన్సిల్ అధ్యక్షుడు అజీమ్ ఆడమ్ వెల్లడించారు. యువతి పరిస్థితిపై మాలెలోని భారత రాయబార కార్యాలయ అధికారులు మాల్దీవుల మంత్రి మరియమ్ షకీలతో మాట్లాడారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి శిక్షిస్తామని ఆమె తెలిపారు.
ముంబయిలో...
ఓ యువకుడు రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని జటాలా ఆదివాసి గ్రామంలో సోమవారం రాత్రి లింగాబాబా పల్లకీ యాత్ర జరిగింది. గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.
ఈ గ్రామానికి చెందిన జిత్రు బబన్ అనే 21 ఏళ్ల యువకుడు.. తల్లి వద్ద ఆడుకొంటున్న బాలికను భోజనం చేసేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పి సమీపంలో గల అంగన్ వాడి భవనంకు తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారం చేశాడు. బాలికకు రక్తస్రావం జరగడంతో అక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బబన్‌కు దేహశుద్ది చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!