తల్లిని చేసి, కన్న కూతుర్నే పెళ్లి చేసుకున్న ఘనుడు

Woman finds out she was married to her father
చెన్నై: కన్న కూతురునే భార్యగా చేసుకున్న ఓ ఘనుడి వ్యవహారం తమిళనాడులో జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి ఓ కూతురుని తల్లిని చేశాడు. మరో కూతురుపై అత్యాచారయత్నం చేయబోయాడు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తేని జిల్లా చిన్నమనూరు సమీపంలోని ఏరాసక్కనాయకనూరులో జరిగింది. ఆ గ్రామానికి చెందిన పాండి అనే నలభై ఏళ్ల వ్యక్తికి ఇరవై రెండేళ్ల క్రితం వివాహం అయింది.

పెళ్లైన దాదాపు రెండేళ్లకు భార్య చనిపోయింది. వీరికి ఓ కుమార్తె ఉంది. భార్య మృతి తర్వాత భువనేశ్వరి అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకూ ఓ కూతురు పుట్టింది. కొంతకాలానికి భువనేశ్వరి కూడా మృతి చెందింది. రెండో భార్య మరణంతో యుక్త వయస్సులో ఉన్న మొదటి భార్య కుమార్తెపై పాండి కన్ను పడింది. ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి తల్లిని చేశాడు.

అమ్మవు అయ్యావు కదా అని చెప్పి ఆమెను భార్యను చేసుకున్నాడు. కూతురునే పెళ్లి చేసుకున్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు రెండేళ్ల చంటిబిడ్డతో ఊర్లు మార్చేవాడు. సోమవారం మళ్లీ పాండి తన సొంత గ్రామానికి వచ్చాడు. ఆ తర్వాత అతను తన రెండో భార్య కుమార్తె పైనా అత్యాచారయత్నం చేశాడు. అతని బారి నుండి ఆమె తప్పించుకుంది. విషయాన్ని స్థానికులకు తెలిపింది.

స్థానికులు, బంధువులు కలిసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొదటి భార్య కూతురును పెళ్లి చేసుకోవడం, ఈమెపై అత్యాచారం చేయడం బండారం మొత్తం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+