మళ్లీ ముప్పు: పేలుళ్ల సూత్రధారి యాసిన్ భత్కల్

ఇదిలావుంటే, హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కిరాతకం ఇండియన్ ముజాహిదీన్ పనే అని దర్యాప్తు అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ పేలుళ్ల ప్రధాన సూత్రధారిగా యాసిన్ భత్కల్‌గా అనుమానిస్తున్నారు. ఇతను రియాజ్ భత్కల్‌తో పాటు 2007 హైదరాబాద్ జంట పేలుళ్లు, పూణే బేకరీ పేలుళ్లు, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్ల ఘటనల్లో పాలు పంచుకున్నాడు.
దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ఘటనలో 5 నుంచి 8 మంది పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. వీరు కర్ణాటకకు చెందినవారని అనుమానిస్తున్నారు. వీరికి స్థానికులు సహకరించారని భావిస్తున్నారు. అఫ్జల్ గురు ఉరి తర్వాత హదరాబాదుతో పాటు పలు నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చునని తాము హెచ్చరికలు పంపించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హైదరాబాదుతో పాటు బెంగుళూర్, ముంబై, కోయంబత్తూర్, హుబ్లీ నగరాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపింది.
టిఫిన్ బాక్సుల కలకలం
హైదరాబాదులోని బేగంపేటలో టిఫిన్ బాక్స్ ఒకటి కలకలం సృష్టించింది. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో వదిలేసిన సైకిళ్లను, టిఫిన్ బాక్సులను, సూట్‌కేసులను చూస్తే హైదరాబాద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బేగంపేటలో వదిలేసిన టిఫిన్ బాక్సులో బాంబు ఉందని పుకార్లు వ్యాపించాయి. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఏమీ లేదని తేల్చారు.












Click it and Unblock the Notifications