Vijay: విజయ్ కొంపముంచిన ఆ పొరబాటు ? గవర్నర్ కు అస్త్రం..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ అవతరించిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. సీఎం సీటును మాత్రం అందుకోలేకపోతున్నారు. గవర్నర్ ను రెండుసార్లు కలిసి తనకు ఉన్న బలాన్ని వివరించి.. రెండు వారాల సమయం ఇస్తే అసెంబబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని చెప్తున్నా.. ఆయన ఒప్పుకోవడం లేదు. ఇలా నాన్చి నాన్చి .. చివరికి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో విజయ్ అత్యధిక సీట్లు సాధించినా ఆయన్ను సీఎం కాకుండా ఆపిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధాన మైన ఓ సాంకేతిక తప్పిదం మాత్రం తాజాగా తెరపైకి వస్తోంది. అదే గవర్నర్ కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల జాబితా. ఇందులో కేవలం టీవీకే ఎమ్మెల్యేలతో సరిపెట్టకుండా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిపి ఆయన గవర్నర్ కు ఇచ్చారు. వాస్తవానికి తన పార్టీ గెలిచిన సీట్ల వివరాలు మాత్రమే ఇచ్చి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటానని విజయ్ చెప్పి ఉంటే గవర్నర్ నుంచీ ఎలాంటి ఆటంకాలు ఉండేవి కాదని నిపుణులు చెప్తున్నారు. కానీ రాజకీయంగా అనుభవం లేని విజయ్ ఈ పొరబాటు చేసి ఉండొచ్చని అంటున్నారు.

How a Small Misstep by Vijay Turned Into His Biggest Obstacle on the Road to Becoming CM

మే 6వ తేదీన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించిన లేఖలో విజయ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు టీవీకే ఎమ్మెల్యేల సంతకాలను కూడా చేర్చడమే ఆయన చేసిన పొరపాటుగా మారింది. ఎందుకంటే విజయ్ ముందుగా ఎన్నికైన 108 మంది టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను మాత్రమే సమర్పించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే, ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే నాయకుడిగా ఆయన హోదా ఖాయమయ్యేది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను చేర్చడం ద్వారా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తున్నట్లు విజయ్ పరోక్షంగా సూచించారు. ఆయన సంకీర్ణ పరిపాలన కోసం తన వాదనను వినిపించినట్లే. బహుశా ఇదే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ అయిన 118 సంతకాలతో తిరిగి రమ్మని గవర్నర్‌ను కోరి, ఆయనను వెనక్కి పంపడానికి దారితీసి ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+