భోగాపురం ఎయిర్ పోర్ట్ పై ప్రధాని ఆసక్తికర పోస్ట్, చంద్రబాబు ఇంట్రెస్టింగ్ రిప్లై!

ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక కల నిజం కాబోతుంది. ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి చాలా ఘనంగా ఏర్పాట్లను చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.

ప్రధాని మోదీ సోషల్ మీడియా పోస్ట్

ఆగస్టు ఒకటవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న క్రమంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "రేపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నాం. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలకమైన రాయి" అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షేర్ చేశారు.

Bhogapuram Airport CM Chandrababu shares PM Modi s post says North Andhra ready for takeoff waiting for PM Modi

విమానాశ్రయ ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపిరి

ఆపై ఉత్తరాంధ్ర టేకాఫ్ కు సిద్ధంగా ఉంది..మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం అంటూ మరో పోస్ట్ చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపిరి వస్తుందని అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పారిశ్రామిక పెట్టుబడులకు, పర్యాటక, ఉపాధి అవకాశాలకు మీ విమానాశ్రయం కేంద్ర బిందువు అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు దేశంలోని అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్

దాదాపు 31 నెలలలోనే నిర్మాణం పూర్తయింది. మొదట నిర్ణయించిన గడువు కంటే ఐదు నెలల ముందే ఈ విమానాశ్రయం సిద్ధమైంది. దాదాపు నాలుగు వేల 700 కోట్ల రూపాయల నుండి ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు దేశంలోని అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకటి అని చెప్పవచ్చు. మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంది.

సనత్ నగర్ టిమ్స్ కు మాజీ సీఎం పేరు, ఇంచార్జ్ డైరెక్టర్ గా ఆయనే!
సనత్ నగర్ టిమ్స్ కు మాజీ సీఎం పేరు, ఇంచార్జ్ డైరెక్టర్ గా ఆయనే!

ఉత్తరాంధ్రకు మెరుగైన కనెక్టివిటీని అందించే ఎయిర్ పోర్ట్

భవిష్యత్తులో దీనిని నాలుగు కోట్ల మంది వరకు పెంచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రకు మెరుగైన కనెక్టివిటీని అందించే ఈ విమానాశ్రయం, ఆగస్టు 17వ తేదీ నుండి వాణిజ్య విమాన సేవలను అందించనుంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు దేశీయ విమానాలు నడవనున్నాయి. అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా సేవలు అందించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+