ఎలిమినేషన్ నుంచి అందుకే సేవ్ చేశావా.. రియాలిటీ షోనా? బూతు షోనా?

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రస్తుతం ఆసక్తికరమైన మలువులతో కొనసాగుతోంది. ఇప్పటికే 3 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో మొదటి వారం చైత్ర, రెండో వారం కృష్ణుడు ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక మూడో వారంలో వర్షిణి లేదా వంశీలలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా.. ముఖేష్ తన కెప్టెన్సీ పవర్ ను త్యాగం చేసి మరీ వారిద్దరినీ ఎలిమినేషన్ నుంచి కాపాడాడు. దీంతో మూడో వారం ఎవరూ ఎలిమినేట్ కాకుండా హౌస్‌మేట్స్ అందరూ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు.

ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' పై త్రివిక్రమ్ కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌ కు పూనకాలే..!
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' పై త్రివిక్రమ్ కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌ కు పూనకాలే..!

అయితే ఎలిమినేషన్ నుంచి కాపాడిన అనంతరం హౌస్‌లో వర్షిణి, ముఖేష్‌ల ప్రవర్తన హద్దులు మీరుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో వినోదంతో పాటు లవ్ ట్రాకులు క్రియేట్ చేయడం సహజమే అయినా, వీరిద్దరి వ్యవహారం మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. ఇటీవల ఎపిసోడ్లో ఓ వైపు త్రిగుణ్, రోహిత్, షాలిని, అపూర్వ అందరూ టాస్క్ గెలవడం కోసం గొడవ పడుతుంటే.. మరోవైపు వర్షిణి, ముఖేష్ లు ఏ మాత్రం పట్టించుకోకుండా రొమాన్స్ చేసుకోవడంలో మునిగిపోయారు.

Bigg Boss 10 Telugu Netizens Troll Mukesh and Varshini Over Double Standards in Live Stream

ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీరికి కరాణీ కళ్యాణి, బ్రహ్మానందం కామెడీ వాయిస్ లను జోడించి మీమ్స్ రూపంలో ట్రోల్స్ చేస్తున్నారు. ఓ పక్క టాస్క్ జరుగుతుంటే వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా కేవలం స్క్రీన్ స్పేస్, కంటెంట్ కోసమే చేస్తున్నారని అర్ఖమవుతున్నప్పటికీ.. బయట ప్రేక్షకుల్లో మాత్రం వీరిపై తీవ్ర ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతోందని స్పష్టమవుతోంది.

బాలయ్య- కొరటాల శివ మూవీపై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్ కు డబుల్ ధమాకా
బాలయ్య- కొరటాల శివ మూవీపై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్ కు డబుల్ ధమాకా

మరోవైపు ముఖేష్ అభిమానులు కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ ఇవ్వడానికా లేక వర్షిణితో రొమాన్స్ చేయడానికా కెప్టెన్సీ పవర్ ను వదులుకుని ఆమెను సేవ్ చేశావంటూ ముఖేష్‌ను ప్రశ్నిస్తున్నారు. ముఖేష్, వర్షిణిల డబుల్ స్టాండర్డ్స్ ప్రవర్తనపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైవ్ లో వీరిద్దరు ప్రవర్తిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కెప్టెన్సీ టాస్క్‌లో అమన్, వర్షిణి మధ్య ఫిజికల్ టచ్ జరిగినప్పుడు ముఖేష్, వర్షిణి ఇద్దరూ తీవ్రంగా తప్పుబట్టారు. కానీ ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ లో ముఖేష్, వర్షిణి దగ్గరకు రావడం, సరదాగా టచ్ చేస్తూ వెనుక పరిగెత్తడం, ఒంటిపై చేతులు వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "అమన్ టచ్ చేస్తే తప్పు.. కానీ ముఖేష్ టచ్ చేస్తే ఒప్పా?" అంటూ వీరి డబుల్ స్టాండర్డ్స్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బిగ్ బాస్ షోను కుటుంబంతో కలిసి చూసే స్థాయి దాటిపోతోందని.. ఇది రియాలిటీ షోనా లేక మరేదైనా(బూతు) షోనా అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు .

బిగ్ బాస్ షోపై ప్రశ్నలు
మరోవైపు చాలా మంది నెటిజన్లు ఈ రియాలిటీ షోపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల ప్రేక్షకులకు వచ్చే లాభం ఏమిటని.. సభ్యసమాజానికి దీని వల్ల ఉపయోగం ఏమిటని నెటిజన్లు ప్రశ్నస్తున్నారు. వర్షిణి, ముఖేష్ రొమాన్స్ వీడియోలు చూసిన నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది రియాలిటీ షో కాదు.. బూతు షో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి షోలను నిషేధించాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+