The Paradise Teaser: నాని 'ప్యారడైజ్' టీజర్ వచ్చేస్తోంది.. జడల్ జమానా షురూ..!
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కు అద్దిరిపోయే న్యూస్ వచ్చేసింది. నాని ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ది ప్యారడైజ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇప్పుడు రచ్చరచ్చ చేస్తోంది. 'ప్యారడైజ్'మూవీ నుంచి టీజర్ రిలీజ్ కానుంది. ఆగస్టు 6 న 'జడల్ జమానా' పేరుతో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. 'ప్యారడైజ్' మూవీ నుంచి ఏ చిన్న చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.
The Paradise Teaser.
— Srikanth Odela (@odela_srikanth) July 31, 2026
August 6th. pic.twitter.com/EzJwA8AdTr
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఆగస్టు 6 న దాదాపు ఒక నిమిషం 30 సెకన్లపాటు నిడివి ఉన్న టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఇక ప్యారడైజ్ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ ఆగస్టు 21 న రిలీజ్ అవుతుందని అంతా భావించినా ఇటీవల మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆగస్టు 6 న రిలీజ్ కానున్న టీజర్ చివరలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు ఈ సినిమా డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇక శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో ఇదివరకు వచ్చిన దసరా మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ప్యారడైజ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకున్నాయి. ఇక నానికి జోడీగా ఈ మూవీలో కయాదు లోహర్ నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన సికంజా మాలిక్ అనే వైవిధ్యమైన పాత్రలో మెప్పించనున్నారు. అలాగే తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications