భల్లాలదేవుడికి ఏమైంది..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్నా..!
బాహుబలి సినిమా అనగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు భల్లాలదేవుడి పాత్రకు ప్రాణం పోసిన రానా దగ్గుబాటి కూడా గుర్తుకువస్తారు. హీరోగా చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలతో అలరించారు రానా దగ్గుబాటి. 2010 లో లీడర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ మూవీ కమర్షియల్ గా హిట్ అయింది. అలా ఫస్ట్ సినిమాతోనే రానా దగ్గుబాటి హిట్ కొట్టారు. ఆ తర్వాత హిందీలో ధమ్ మారూ ధమ్ సినిమాతో అలరించారు.
ఇక 2011 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నేను నా రాక్షసి మూవీ చేశారు. ఆ తర్వాత హిందీలో హే జవానీ హే దివానీ, బేబీ లాంటి సినిమాలతో మెప్పించారు. ఇక 2015 లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మూవీ రానాకు బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో భల్లాలదేవ పాత్రకు ప్రాణం పోశారు. ఆ తర్వాత బాహుబలి ది కంక్లూజన్ లోనూ అదే పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లో విధ్వంసం సృష్టించారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో రానా కు కూడా అదే స్థాయలో ప్రశంసలు దక్కాయి.
ఈ సినిమాల తర్వాత నేనే రాజు నేనే మంత్రి, ఘాజీ సినిమాలతో నటనలో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో భీమ్లా నాయక్ లో నటించారు. అటు విరాటపర్వం, కాంత సినిమాలోని పాత్రలు కూడా రానాకు గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ సిరీస్ తో బిజీగా ఉన్నారు రానా దగ్గుబాటి. అయితే ఇటీవల రానాకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ లుక్ లో రానా చాలా పేలగా, బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. దాంతో రానా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాహుబలిలో భల్లాలదేవుడిగా ఉన్న రానా ఇలా అయిపోయాడేంటి అని కామెంట్స్ పెడుతున్నారు. తలకు క్యాప్ పెట్టుకుని క్యాజువల్ టీ షర్ట్ ధరించిన రానా గడ్డం లేకుండా ఒత్తయిన మీసంతో ఉన్నారు. బహుశా ఆయన తదుపరి సినిమా కోసం మేకోవర్ అవుతున్నట్లు మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications