భారత్ పై దాడికి తయారు చేసిన ఉగ్రవాద సంస్థే ఇప్పుడు పాక్ కు ఏకు మేకై..
పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్ 27 నుంచి ఈ ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యాయి. అయితే ఈ ఆందోళనలు చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వం మారణకాండ కొనసాగిస్తోంది.
పాకిస్థాన్ సైన్యం జరిపిన దాడుల్లో నాలుగు రోజుల్లోనే దాదాపు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రశాంతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారిపై పాక్ సైన్యం వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. పీఓకేలో పాకిస్థాన్ ఆకృత్యాలను ప్రపంచదేశాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఈ దారుణాలకు పాకిస్థాన్ జవాబు చెప్పేలా బాధ్యత వహించేలా చేయాలని తెలిపారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ భారీ స్థాయిలో నిరసనలు చేపడుతోంది. గత రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు పెరగడం, అలాగే మైనారిటీలపై రాజకీయంగా కక్షసాధింపు చర్యలు తదితర అంశాలపై ఈ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bi-Weekly Media Briefing by the Official Spokesperson (July 31, 2026)
— Randhir Jaiswal (@MEAIndia) July 31, 2026
https://t.co/BksUdIAwny
" పీఓకేలో ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను పాకిస్థాన్ రక్షణమంత్రి శత్రువులుగా అభివర్ణించి వారిని చిత్రహింసలు పెట్టడం అత్యంత హేయమైన చర్య. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ధ్రువీకరించారు. భారత్ ను దెబ్బతీయడానికి పాకిస్థాన్ శిక్షణ ఇచ్చి ఆయుధాలను సమకూర్చి పంపిన ఆ మూజాహిదీన్ లే ఇప్పుడు తమ తుపాకులను సొంత దేశం వైపునకు గురిపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలను ధరించారు" అని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను అక్కడి ప్రజలు బహిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ దుశ్చర్యలపై అంతర్జాతీయ సంస్థలు వ్యక్తిగతంగా దర్యాప్తు నిర్వహించాలని కోరుతున్నాయని అన్నారు. మరోవైపు పీఓకేలో చేపట్టిన నిరసనలు 51 రోజులకు చేరుకున్నాయి. ఆందోళనకారులపై పాకిస్థాన్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాయి. దాంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2 న జరగబోయే ఎన్నికలను స్థానికులు బహిష్కరించారు.













Click it and Unblock the Notifications