సింహాలొచ్చేశాయ్! 143 ఏళ్ల తర్వాత అడవిలోకి పూర్వ ఆగమనం..

గుజరాత్‌లోని బర్డా అడవులు ఇప్పుడు అరుదైన చారిత్రక ఘట్టానికి వేదికగా మారుతున్నాయి. ఏకంగా 143 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా సింహాలు ఈ అడవులకు తిరిగి స్వయంగా వచ్చి చేరాయి. ఈ పరిణామాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం.. అడవుల్లో సింహాల సంరక్షణ, వాటి పునరావాస కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా పోర్బందర్ అడవులన రూపురేఖలను పూర్తిగా మారుస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ బాధ్యతలను మరింత స్పష్టంగా నిర్దేశించేలా ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళన చేపట్టారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రుల మార్గదర్శకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయంతో పోర్బందర్ జిల్లా పరిధిలోని రేంజ్‌లు, బీట్లు, అధికారుల నియామకం, సిబ్బంది విధులు మారనున్నాయి. అంతేకాకుండా వాహనాలు, ఆయుధాలు, వైర్‌లెస్ పరికరాలు వంటి అన్ని వనరులను క్రమబద్ధీకరించి క్షేత్రస్థాయిలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేలా అధికారిక విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.

Asiatic Lions Return to Barda Forest After 143 Years as Gujarat Government Reorganises Forest Division

సరికొత్తగా రేంజ్‌లు.. విస్తరించిన పరిధి

ఈ మార్పుల్లో భాగంగా పోర్బందర్ రేంజ్‌ను కొత్తగా తీర్చిదిద్దారు. దీనికింద 80 గ్రామాల పరిధిలోని దాదాపు 6,840 హెక్టార్లను చేర్చారు. అలాగే రణవవ్ రేంజ్ పరిధిని కూడా విస్తరించి సుమారు 27 గ్రామాలను దీని కిందకు తెచ్చారు. జామ్‌నగర్ అడవుల విభాగంలో ఉన్న కొన్ని ప్రాంతాలను, భాన్వద్ రేంజ్‌ను కూడా పోర్బందర్ డివిజన్ పరిధిలోకి మార్చారు. దీనివల్ల కుటియానా రేంజ్, పోర్బందర్ సోషల్ ఫారెస్ట్రీ, రణవవ్ సోషల్ ఫారెస్ట్రీ రేంజ్‌లు అన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. మొత్తంగా ఇప్పుడు పోర్బందర్ అడవుల విభాగం కింద ఏడు రేంజ్‌లు పనిచేయనున్నాయి.

70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..
70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..

ఇద్దరు ఏసీఎఫ్‌ల పర్యవేక్షణలో యంత్రాంగం

ఈ విస్తరించిన అటవీ విభాగాన్ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ఇద్దరు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ACF) పోస్టులను కేటాయించారు. మొదటి ఏసీఎఫ్ పోర్బందర్ రేంజ్, సోషల్ ఫారెస్ట్రీ విభాగాలను పర్యవేక్షిస్తే.. రెండో ఏసీఎఫ్ రణవవ్, భాన్వద్, కుటియానా , మొబైల్ స్క్వాడ్ విభాగాలను చూసుకుంటారు. ఈ డివిజన్ మొత్తం జునాగఢ్ వైల్డ్ లైఫ్ సర్కిల్ పరిధిలోనే పనిచేస్తుండగా, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో ఈ అధికారులంతా క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తిస్తారు.

దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్
దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్

సింహాల సంరక్షణే ధ్యేయంగా అడుగులు

బర్డా అడవులకు తిరిగివచ్చిన సింహాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాటికి సురక్షితమైన ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విభాగాన్ని బలోపేతం చేసింది. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమస్యలకు వేగంగా పరిష్కారం లభించేలా ఈ నూతన వ్యవస్థ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సింహాల రాకతో గుజరాత్ అటవీ శాఖ తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు వన్యప్రాణి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+