ఇక తప్పించుకోలేరు: జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ తాజా వ్యూహం: సీడబ్ల్యూసీ భేటీలో..!!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో ముప్పేట దాడికి దిగాలని నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన ఈ పార్టీ ఇకపై ఓటరు జాబితాలో భారీ సంస్కరణలను ప్రతిపాదించింది. జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాతో పాటు ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన ప్రతి ఒక్క ఓటును కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

రాజీనామాకు అంగీకరించకపోతే ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహించాలని, తన పదవికి రాజీనామా చేయాలని ఖర్గే అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

Congress Working Committee Issues Key Demands on Gyanesh Kumar SIR Exercise and Voter Deletion

దేశంలో సామాన్య ఓటరును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఖర్గే విమర్శించారు. పదేళ్ల కిందట ప్రధాని మోదీ నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే చిన్నాభిన్నం చేశారో, ఇప్పుడు ఓట్ల రద్దు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్నారని మండిపడ్డారు. నూతన ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6 నిబంధనలను మార్చడం ద్వారా యువతను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయాలని చూస్తోన్నారని ఆరోపించారు.

మంచు యుగం నాటి ఊల్ మమ్మూత్ మళ్లీ సాక్షాత్కారం: ఆసియన్ ఏనుగులపై ప్రయోగాలు
మంచు యుగం నాటి ఊల్ మమ్మూత్ మళ్లీ సాక్షాత్కారం: ఆసియన్ ఏనుగులపై ప్రయోగాలు

ఈ సంక్షోభం నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ఖర్గే అయిదు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అన్నిరకాల మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బహిరంగపరచాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా, సులువైన విధానంలో ఓటర్ల జాబితాను విడుదల చేయాలని, వాటిని సకాలంలో రాజకీయ పార్టీలకు అందించాలని చెప్పారు. ఓటరు జాబితాల్లో సంభవించిన అక్రమాలపై స్వతంత్ర, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరిపించాలని అన్నారు.

ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన ప్రతి ఒక్క ఓటును కూడా పునరుద్ధరించాలని ఖర్గే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే.. జాబితా నుండి ఓట్లను ఎందుకు తొలగించారనేది ఆ ఓటరుకు ముందుగా సమాచారం ఇవ్వాలని, తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలు, సవరణలపై తీసుకునే నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా ఉండాలని, కుట్రపూరిత చర్యల ద్వారా అర్హులైన దేశ పౌరుల ఓటు హక్కును కాలరాయడమే లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.

మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్
మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్

1988లో రాజీవ్ గాంధీ హయాంలో అప్పటి ప్రభుత్వం ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి దేశ యువతకు అపారమైన రాజకీయ శక్తిని అందించిందని ఖర్గే గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం దీనికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తోందని, యువతకు ఓటు హక్కు లేకుండా చేయడానికి జెన్ జీ పై కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. ఈ అక్రమ మార్పులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+