పావలా వడ్డీకే రుణాలు. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సీఎం!
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యా కలలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో 'సూపర్ సిక్స్' పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం, విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేవలం ఆర్థిక సాయమే కాకుండా, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖల హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ (IIT) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కించుకునేలా ఎస్సీ, ఎస్టీ యువతకు జర్మన్ భాషలో తర్ఫీదు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు కేవలం 'పావలా వడ్డీ'కే విద్యా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేలా పక్కా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సంక్షేమ పథకాలపై సీఎం సమీక్ష
సూపర్ సిక్స్ పథకాల అమలు తీరును వివరిస్తూ, లబ్ధిదారుల ఇంటిగ్రేషన్ గురించి సీఎం చర్చించారు.
దీపం-2.0
ఈ పథకం కింద 1.08 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటి వరకు రూ. 3,504 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సబ్సిడీ సొమ్మును నిర్ణీత తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని సూచించారు.
స్త్రీశక్తి:
రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలు 60.6 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఈ పథకానికి ఏటా రూ. 1,940 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
తల్లికి వందనం:
67 లక్షల మంది తల్లులకు రూ. 10 వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
మత్స్యకారుల భరోసా:
మే 19వ తేదీన మత్స్యకారుల సేవలో భాగంగా రూ. 286 కోట్ల లబ్ధిని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
హాస్టళ్లలో 'నెట్ జీరో' విప్లవం.. అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండింగ్
సంక్షేమ హాస్టళ్లలో వనరులు వృథా కాకుండా 'నెట్ జీరో' విధానాన్ని వర్తింపజేయాలని, కిచెన్ వ్యర్థాలను సర్కులర్ ఎకానమీకి అనుసంధానించి హెల్తీ క్యాంపస్ లుగా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, పసుపు, కుంకుమపువ్వు సాగుకు ఊతమివ్వాలని, అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చేందుకు పర్యాటక రంగంతో అనుసంధానించాలని సూచించారు. నేచురల్ ఫార్మింగ్, సర్టిఫికేషన్ ప్రక్రియల ద్వారా గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని అధికారులను కోరారు.














Click it and Unblock the Notifications