హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫొటోలు: చిరంజీవి సహా ముచ్చటగా ముగ్గురే..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లతో తెలంగాణ వాదం వేడి తగ్గినట్లే కనిపిస్తోంది. దీంతో సర్గుకోవడానికి తగని వెసులుబాటు కాంగ్రెసు పార్టీకి చిక్కినట్లే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా తెలంగాణ అంశం తేలుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. సాధ్యమైనంత వరకు తెలంగాణ అంశాన్ని వాయిదా వేయడానికే కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మారుస్తారనే ప్రచారం కూడా సోదిలో లేకుండా పోయింది. సహకార సంఘాల ఎన్నికలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలపడినట్లు కనిపిస్తున్నారు. నాయకత్వం మార్పు అనేది ఎన్నికల లోపు ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. 2014 శానససభ, లోకసభ ఎన్నికలకు కూడా కిరణ్ కుమార్ రెడ్డే సారథ్యం వహించే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యం తగ్గినట్లు కాంగ్రెసు పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల నాటికి ఆయన ప్రాబల్యం పూర్తిగా తగ్గుతుందని అనుకుంటున్నారు. కాంగ్రెసు పార్టీని వీడి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినవారు కూడా పునరాలోచనలో పడే అవకాశాలున్నాయని అంటున్నారు. కొత్తగా చేరుతున్నవారికి, పాత నాయకులకు మధ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పొడసూపుతున్న విభేదాలు పెరగవచ్చునని అంటున్నారు. ఇది కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.

ఫొటోలు: చిరు సహా ముగ్గురే..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అంతా తానై నడిపించేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహార శైలిని పుణికి పుచ్చుకుని ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

ఫొటోలు: చిరు సహా ముగ్గురే..

పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తన పాత్రను పోషించే అవకాశాలున్నాయి. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అనుసరించక తప్పదని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రోజురోజుకూ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఆయన చెప్పినట్లు బొత్స సత్యనారాయణ నడుచుకోవాల్సిందేనని అంటున్నారు.

ఫొటోలు: చిరు సహా ముగ్గురే..

రాష్ట్ర రాజకీయాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి వచ్చే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ప్రచార బాధ్యతలను పార్టీ అధిష్టానం ఆయనపై మోపే అవకాశాలున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిని, బొత్సను కలుపుకుని ఆయన ప్రచారం నిర్వహించవచ్చు. టికెట్ల కేటాయింపులో తన పట్టు సాధించడానికి ప్రయత్నించవచ్చు. అవకాశం చిక్కితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడవచ్చు.

ఫొటోలు: చిరు సహా ముగ్గురే..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు నుంచి బయటకు వస్తారా, లేదా అనేది కూడా సందేహాస్పదంగానే ఉంది. ఆయన బయటకు రాకపోతే పార్టీ అనుకున్న రీతిలో ఫలితాలు సాధించకపోవచ్చునని అంటున్నారు.

తెలంగాణలో కూడా రెండు మూడు జిల్లాలు మినహాయిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రాబల్యం అంతగా ఉండకపోవచ్చునని అంటున్నారు. కాంగ్రెసుకు క్రమంగా వాతావరణం అనుకూలంగా మారుతోందనే అంచనాల్లో ఉన్నారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల బాధ్యతను, ప్రచారాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి భుజాన వేసుకుంటారని భావిస్తున్నారు.

English summary
In the 2014 elections CM Kiran Kumar Reddy may play a key role in Congress party. Chiranjeevi and Botsa Satyanarayana may help him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X