ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు-ఐదు రాష్ట్రాల ఫలితాలు చూశాక..!

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఇందులో బీజేపీ అత్యధికంగా మూడు చోట్ల గెలిచింది. తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో ముస్లింలు సెక్యులర్ పార్టీలకు మద్దతిచ్చినా ఫలితం లేకుండా పోయిందని, బీజేపీ ఆయా సీట్లను ఎగురేసుకుపోయిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ముస్లింలకు ఓ కీలక పిలుపునిచ్చారు.

ముస్లింలు తమ సొంత స్వతంత్ర రాజకీయ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలని తాను భావిస్తున్నట్లు ఓవైసీ వెల్లడించారు. బీజేపీని ఆపడంలో విఫలమవుతున్న లౌకికవాద పార్టీలని చెప్పుకునే వాటికి మీరు ఓటు వేయడం వల్ల మీ ఓటు వృధా అవుతుందని ముస్లింలకు ఆయన తెలిపారు. ముస్లింలు తమ సొంత నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఓవైసీ స్పష్టం చేసారు.

Asaduddin Owaisi Says Muslim Votes Are Being Wasted on Secular Parties Calls for Independent Political Leadership

ఈ లౌకికవాద పార్టీలని చెప్పుకునే వాటిపై విశ్వాసం ఉంచడం వల్ల ఏమీ లభించలేదు అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పేశారు. కాబట్టి ముస్లింలు తమ నాయకుల్ని ఎన్నుకుని స్వతంత్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీలకు వ్యతిరేకంగా బరిలోకి దిగి ముస్లింల ఓట్లు చీల్చి, అంతిమంగా బీజేపీకి మేలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఓవైసీ.. ఈసారి కూడా బెంగాల్లో బరిలోకి దిగి ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ హిందూ ఓట్ల ఏకీకరణ చేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీపీ ఇచ్చిన పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+