బాబుకు మాజీ షాక్: టిఆర్ఎస్‌లోకి!, బుజ్జగింపులకు నో

అయితే, ఆయన మాత్రం పార్టీని వీడేందుకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవంటున్నారు. తాను పార్టీ అధినేతను ఒకటి రెండు రోజుల్లో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. పార్టీని వీడేందుకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితితో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా పి చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్సీ సీటు కోసమే ఆయన వీడుతున్నారని ఇంకొందరు చెబుతున్నారు.
చంద్రశేఖర్ త్వరలో తెలంగాణ సాధన కోసం పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆయన కెసిఆర్‌తో చర్చలు జరిపారట. ఆయన సమక్షంలో త్వరలో తెరాసలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఆయన మాత్రం ఏ పార్టీలో చేరే విషయాన్ని ఇప్పటి వరకు చెప్పలేదు. జెఏసితో కలిసి పని చేస్తానని చెప్పారు.
బుజ్జగింపులు
చంద్రశేఖర్‌ను బుజ్జగించే పనిలో టిడిపి జిల్లా నేతలు పడ్డారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పార్టీని వీడారు. ఇప్పుడు మరో సీనియర్ నేత వీడుతుండటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పి.చంద్రశేఖర్ రవాణా, న్యాయ, పంచాయతీరాజ్, భారీ పరిశ్రమల శాఖల మంత్రిగా పని చేశారు. అలాంటి సీనియర్ నేత ఒక్కసారిగా పార్టీని వీడుతానని చెప్పడంతో బుజ్జగిస్తున్నారు. ఆయన మాత్రం బుజ్జగింపులకు లొంగటం లేదని తెలుస్తోంది.
మైసూరా రెడ్డిపై దూళిపాళ్ల ఫైర్
తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ విప్ దూళిపాళ్ల నరేందర్ వేరుగా హెచ్చరించారు. వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవిశ్వాసం సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. విప్ ధిక్కరించిన వారిపై చర్యలకు వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి రాజ్యసభ కోసం ఏమైనా చేస్తారని ఆయన విమర్శించారు. మైసూరావి ఊసరవెళ్లి రాజకీయాలన్నారు.












Click it and Unblock the Notifications