కరుణపై జయలలిత విసుర్లు: మార్పులేదని మాయావతి

శ్రీలంకలో తమిళులను ఊచకోత కోస్తుంటే డిఎంకె ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. అప్పుడు మిన్నకుండిపోయిన వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కరుణానిధి వైఖరి వల్ల శ్రీలంక తమిళులకు ఎలాంటి మేలు, లాభం జరగదన్నారు. కరుణానిధి వైఖరిపై ఆమె ఎద్దేవా చేశారు. ఊచకోత జరుగుతున్న సమయంలో ఆ పార్టీ మాట్లాడలేదని నిప్పులు చెరిగారు.
మా వైఖరిలో మార్పు లేదు
యూపిఐపై తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి(బిఎస్పీ), ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. యూపిఏ-2కు తాము బయటి నుండి మద్దతిస్తామని స్పష్టం చేశారు.
యూపిఏకు మరో షాక్
ఇప్పటికే డిఎంకె ఉపసంహరణతో ఇబ్బందుల్లో పడిన కేంద్ర ప్రభుత్వానికి మరో పార్లమెంటు సభ్యుడు షాక్ ఇచ్చారు. విసికె పార్టీ ఎంపి తిరుమావలనన్ మంగళవారం యూపిఏకు మద్దతును ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ రోజు సాయంత్రం డిఎంకె మంత్రులు తమ రాజీనామాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతిలకు ఇవ్వనున్నారు.
డిఎంకె మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో కాంగ్రెసు కోర్ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఆంటోనీ తదితరులు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications