దాడికి ప్రణాళిక: మాజీ విద్యార్థి కాల్చుకుని మరణించాడు

Former Student Planned To Stage Attack At Central Florida University
వాషింగ్టన్: సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి తనను తాను కాల్చుకుని మరణించాడు. అతనితో పాటు ఉన్న ఆయుధాలు, బాంబుల బ్యాగ్ ఉంది. యూనివర్శిటీ ఆఫ్ సెంట్రలో ఫ్లొరిడా‌కు చెందిన జేమ్స్ ఓలివర్ శివకుమారన్ (30) వర్శిటీలో భారీ దాడికి ప్రణాళిక రచించినట్లు యూనివర్శిటీ పోలీసు చీఫ్ రిచర్డ్ బెయిరీ అన్నారు. అయితే, సోమవారం ఉదయం తన ఆలోచనను మానుకుని తనను తాను కాల్చి చంపుకున్నారని అన్నారు.

శివకుమారన్ కాలేజ్ ఆఫి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (2010 -12) విద్యార్థి. ఈ ఏడాది ఓ కోర్సులోనూ పేరు నమోదు చేయించుకోలేదని, వర్శిటీ నుంచి వెళ్లే ప్రక్రియ కొనసాగుతోందని యుసిఎఫ్ తెలిపింది. సోమవారం తెల్లవారు జామున శివకుమారన్ తన గదిలో తుపాకితో కాల్చుకుని మృతి చెందాడని, అక్కడ ఐఇడిలు ఉన్న సంచీ కూడా ఉందని పోలీసులు వివరించారు.

తమకు కొన్ని నోట్స్, రచనలు కూడా లభించాయని, వాటిని బట్టి శివకుమారన్ దాడికి ప్రణాళిక రచించాడని అర్థమవుతోందని బెయిరీ అన్నారు. శివకుమారన్ తొలుత తన రూమ్మేట్‌పై గన్ గురి పెట్టాడని, అతను బాత్రూంలోకి పారిపోయి 911 కాల్ చేశాడని, పోలీసులు రావడం గమనించిన శివకుమారన్ అప్పటికప్పుడు తన ప్రణాళికను మార్చుకుని ఉంటాడని అంటున్నారు.

సరైన సమయంలో హెచ్చరికలు రాకపోయి ఉంటే మరో వర్జీనియా టెక్ స్టైల్ బ్లడ్ బాత్ జరిగి ఉండేదని అంటున్నారు. ఈ సంఘటనతో అర్థరాత్రి 500 మంది విద్యార్థులను భవనం నుంచి ఖాళీ చేయించారు. ఉదయం పూట తరగతులను రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+