హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సే.. యమలోకంలో ధర్నాచేయండి: 'జగన్'కి గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యమలోకంలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంతటి విద్యుత్ సమస్యకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమన్నారు. కాబట్టి వారు యమలోకంలో ధర్నా చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. సభలో విద్యుత్ సమస్య చర్చకు రావద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావించిందన్నారు.

విద్యుత్ సమస్యపై తాము వామపక్షాలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఏప్రిల్ 9వ తేదిన తాము బందుకు పిలుపునిస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్ సమస్య పైన తాము చేపట్టిన దీక్షను అవహేళన చేయడం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.

కాగా, తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న అధినేత నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్సు ద్వారా నిరాహార దీక్ష చేస్తున్న నేతలతో మాట్లాడారు. మరోవైపు విద్యుత్ సమస్య పైన తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్(టిఆర్ఎల్డీ) విద్యుత్ సౌధ వద్ద ఆందోళన చేపట్టింది.

బాబ్లీపై అఖిలపక్షం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బాబ్లీ పైన అఖిల పక్షం సమావేశమైంది. అఖిల పక్షానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావు, విజయ రమణ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి వినోద్ కుమార్, విద్యాసాగర రావు, వైయస్సార్ కాంగ్రెసు నుండి కెకె మహేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు, బాజిరెడ్డి గోవర్ధన్, సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి, మల్లారెడ్డి, మజ్లిస్ నుండి జాఫ్రి, భారతీయ జనతా పార్టీ నుండి శేషగిరి రావు, అధికార పార్టీ నుండి పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబులు హాజరయ్యారు.

English summary
Telugudesam Party senior leader Gali Muddukrishnama Naidu has suggested YSR Congress Party that they will stage agitation in Yamalokam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X